by Suryaa Desk | Fri, Nov 22, 2024, 03:43 PM
ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన తొగుటలో తెలంగాణ ముదిరాజు మహాసభల మండల అధ్యక్షులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉల్లెంగుల సాయికుమార్ ముదిరాజ్ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మత్స్య సంపదను పెంపొందించాల్సిన బాధ్యత ముదిరాజు కులస్తులందరిపై ఉందని గుర్తు చేశారు, మరియు ముదిరాజ్ కులస్తులను BC D నుండి BC A వర్గీకరణకు మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు.
మత్స్య కార్మికులకు చెరువులలో చేపలు పట్టుకునేందుకు వీలుగా రాయితీపై వలలు, ద్విచక్ర వాహనాలు, తెప్పలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్ సంఘం నాయకులు బర్రెంకల మల్లేష్ ముదిరాజ్, బర్రెంకల స్వామి ముదిరాజ్, చిక్కుడు కరుణాకర్ ముదిరాజ్, లచ్చోళ్ళ గణేష్ ముదిరాజ్, కాళ్ల సజ్జు ముదిరాజ్,బర్రెంకల శ్రీను ముదిరాజ్, చిక్కుడు స్వామి ముదిరాజ్, బరేంకల రవి ముదిరాజ్, చిక్కుడు బాలమల్లు ముదిరాజ్, పిట్ల నరేష్ ముదిరాజ్, చిక్కుడు సుధాకర్ ముదిరాజ్, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు