by Suryaa Desk | Fri, Nov 22, 2024, 03:58 PM
గురువారం పరకాల నియోజకవర్గంలో ఆత్మకూరు మండలం లో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ప్రతి మండల ప్రభుత్వ కార్యాలయాలు మరియు గ్రామ పంచాయితీ కార్యాలయాలు లో సమాచార హక్కు చట్టం బోర్డు నియమించాలని తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేత ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం-2005 పరకాల డివిజన్ అధ్యక్షుడు నేరెల్ల అనిల్ గౌడ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ బద్దమైనటువంటి సమాచార హక్కు చట్టం - 2005 సెక్షన్ 5(1)(2) ప్రకారం మండలంలోని మరియు గ్రామ స్థాయిలోని అన్ని ప్రభుత్వ.
కార్యాలయల యందు సెక్షన్ 4 (4) ప్రకారం స్థానిక అధికార భాషలో సమాచార బోర్డులు ఏర్పాటు చేయలని మరియు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార బోర్డుల యందు గల అసంపూర్తి సమంచారాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించాలని మరియు సమాచార హక్కు చట్టం - 2005 సెక్షన్ 4(1) (8) (ప్రకారం స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన 17. అంశాల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచగలరని కోరుతున్నాము. సమాచార హక్కు చట్టం -2005 సెక్షన్ 26 ప్రకారం గ్రామస్థాయి వరకు సమాచార హక్కు చట్టంపై ప్రజలకు శాఖాంపరమైన అవగాహాన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో నర్సంపేట అధ్యక్షుడు చెట్టుపేల్లి విజేందర్ ,నర్సంపేట యూత్ అధ్యక్షుడు అడ్డ సతీష్ ,ఆత్మకూరు మండల అధ్యక్షులు సుద్దాల అనిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంకటి శ్యామ్ సుందర్ , నిరుకుల్ల అధ్యక్షుడు అంకతి రాజుకుమార్ పాల్గొన్నారు.