![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 08:23 PM
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మొదట బెట్టింగ్ యాప్స్ కేసులో 11 మంది యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లు, బుల్లితెర నటుల పైన కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు.యాంకర్ విష్ణుప్రియ వేసిన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఇటీవల విష్ణుప్రియకు పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని అలాగే తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
Latest News