|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 05:00 PM
బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ యొక్క 'సికందర్' చిత్రం ఈద్ స్పెషల్‌గా విడుదల అయ్యింది. A.R.మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ప్యాక్ డ్రామా వరల్డ్ వైడ్ గా 200 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఈ చిత్రం నెట్ఫ్లిక్ లో ప్రసారానికి అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్ ఇటీవల మే 26 మరియు జూన్ 1, 2025 మధ్య కాలానికి ట్రెండింగ్ సినిమాలు మరియు సిరీస్‌ల యొక్క టాప్ 10 జాబితాను విడుదల చేసింది. డేటా ప్రకారం, సికందర్ గ్లోబల్ నాన్-ఆంగ్లిష్ చిత్రాల విభాగంలో మూడవ స్థానాన్ని సొంతం చేసుకుంది. సికందర్ 5.1 మిలియన్ వీక్షణలతో 11.4 మిలియన్ స్ట్రీమింగ్ గంటలను లాగిన్ చేసింది. స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. రష్మిక మాండన్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన నటించారు. కాజల్ అగర్వాల్, సత్యరాజ్ మరియు ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రీతం సంగీతం మరియు సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు అందించారు. సాజిద్ నాడియాద్వాలా ఈ సినిమాని నిర్మించారు.
Latest News