|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 05:31 PM
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ జూన్ 20న విడుదల కానున్న స్పోర్ట్స్ కామెడీ-డ్రామా 'సీతారే జమీన్ పార్' తో ప్రేక్షకులను అలరించడానికి సన్నద్ధమవుతున్నాడు. దీని తరువాత నటుడు దాదాసాహెబ్ ఫాల్కే యొక్క బయోపిక్ కోసం పని చేయడం ప్రారంభిస్తారు. ఇది ఈ సంవత్సరం సెట్స్ పైకి వెళ్తుంది. రాజ్‌కుమార్ హిరానీ జీవిత చరిత్ర చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, అమీర్ మరియు హిరానీ పికె యొక్క సీక్వెల్ మీద పని చేస్తారు. సైన్స్ ఫిక్షన్ కామెడీ-డ్రామా బాలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం దృడమైన విమర్శకుల ప్రశంసలను అందుకుంది మరియు వివాదాలు ఉన్నప్పటికీ ఇది బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఈ సీక్వెల్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News