|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 05:58 PM
నటుడు రానా దగ్గుబాటి ముంబై విమానాశ్రయంలో ఫొటోగ్రాఫర్ల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫొటోలు తీయవద్దని ఆయన కోరినప్పటికీ, వారు ఆయనను వెంబడించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.వివరాల్లోకి వెళితే, మంగళవారం రాత్రి ముంబై విమానాశ్రయానికి చేరుకున్న రానా, అక్కడి నుంచి పార్కింగ్ ప్రాంతంలో ఉన్న తన వాహనం వైపు వెళుతున్నారు. ఆ సమయంలో కొందరు ఫొటోగ్రాఫర్లు ఆయనను చుట్టుముట్టి ఫొటోల కోసం అభ్యర్థించారు. అయితే, రానా వారిని సున్నితంగా తిరస్కరిస్తూ, "వద్దు... దయచేసి ఫొటోలు తీయొద్దు" అంటూ ముందుకు సాగారు. అయినప్పటికీ ఫొటోగ్రాఫర్లు ఆయనను అనుసరించడం మానలేదు.ఈ క్రమంలో, ఫొటోగ్రాఫర్ల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రానా అనుకోకుండా ఒక మహిళను ఢీకొట్టారు. అదే సమయంలో ఆయన చేతిలోని ఫోన్ కూడా కిందపడిపోయింది. ఈ పరిణామంతో ఆయన చికాకుకు గురయ్యారు. ఓ వీడియోలో, రానా ఒక ఫొటోగ్రాఫర్ వైపు దూసుకెళ్లి, "ఎందుకిలా చేస్తున్నారు?" అని ప్రశ్నించడం స్పష్టంగా కనిపించింది. అనంతరం, ఆయన ఫొటోగ్రాఫర్లతో మాట్లాడి, తన ఇబ్బందిని వారికి వివరించారు.
Latest News