|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 03:45 PM
ఖైరతాబాద్ మండలం యూసుఫ్ గూడ గ్రామంలోని సర్వే నంబరు 128/1 లోని మూడున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. గతంలో అర్బన్ ల్యాడ్ సీలింగ్ యాక్ట్‌కింద భూ యజమానుల నుంచి ప్రభుత్వం తీసుకున్న భూమిలో మూడున్నర ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలను హైడ్రా అడ్డుకుంది. యూఎల్‌సీ ల్యాండ్ ప్రభుత్వం క్లియర్‌చేసినట్టు తప్పుడు పత్రాలతో 3600ల గజాల స్థలాన్ని కొట్టేయాలని ప్రయత్నించిన షరీఫ్ ఖాన్ మీద బోరబండ పోలీసు స్టేషన్లో హైడ్రా కేసు కూడా పెట్టింది. ఈ భూమితో కలిపి మొత్తం 3.20ఎకరాల భూమిలో ఇసుక వ్యాపారాలు, ఇటుక వ్యాపారాలతో పాటు.. వెలసిన తాత్కాలిక షెడ్డులను తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది.