|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 11:50 AM
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఈ నెల 11న పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు ఉదయం ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇక్కడ 18 వార్డులు ఉండగా 14 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. 3 వార్డుల్లో కాంగ్రెస్, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది.నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ 12 వార్డులు ఉండగా 11 చోట్ల కాంగ్రెస్, ఒకచోట బీఆర్ఎస్ విజయం సాధించాయి. కాగా, ఈ సమయానికి తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 121 స్థానాలు, బీఆర్ఎస్ 67, బీజేపీ 15, ఇతరులు 14 చోట్ల విజయం సాధించారు.