|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:33 PM
హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో వేగవంతమైన జనాభా వృద్ధి జరుగుతున్న నేపథ్యంలో తాగునీటి అవసరం రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. భవిష్యత్ అవసరాలను దృష్ట్యా ప్రభుత్వం గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ – ఫేజ్-II & III.. మూసీ నది పునరుజ్జీవానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను గోదావరి జలాలతో నింపడానికి అదనంగా 300 ఎంజీడీ నీటిని తరలించడానికి ఈ ప్రాజెక్టు ని చేపట్టింది. అదేవిధంగా, నియో పోలీస్ ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో అధిక స్థాయి వెర్టికల్ అర్బనైజేషన్ వృద్ధి కారణంగా తాగునీటి అవసరం మరింతగా పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆదేశాలతో కొకాపేట్ నియోపోలిస్ లేఅవుట్‌లో సంప్, పంప్ హౌస్,సెక్షన్ ఆఫీస్, GLSR & STP నిర్మాణం” పనులకు చేపట్టగా, ప్రస్తుతం ఈ పనులు స్థలంలో ప్రారంభమై కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో, కొకాపేట్ ప్రాంతంలో జలమండలికి కు ఇప్పటికే ఉన్న భూమిని పూర్తిగా వినియోగించినప్పటికీ, అదనపు భూమి అవసరం ఏర్పడింది.
దీంతో ఖానాపూర్‌లో జలమండలికి ఉన్న 8.75 ఎకరాల భూమి ప్రతిపాదిత 22.5 ఎంఎల్ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, 2 ఎలివేటెడ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్లు (ELSRs), క్లోరినేషన్ గది మరియు నిర్వహణ యూనిట్ నిర్మాణాలకు మాత్రమే సరిపోతుంది.దానికి అదనంగా, ఖానాపూర్ జలమండలికి ఆవరణను ఆనుకుని ఉన్న HMDA గుర్తించిన భూములు — OHT కోసం 1.18 ఎకరాలు, HMDA సైట్ ఆఫీస్ కోసం 0.77 ఎకరాలు మరియు ఆశ్రమం కు చెందిన 2.00 ఎకరాలు (మొత్తం 3.95 ఎకరాలు) జలమండలికి ప్రభుత్వాన్ని కేటాయించవలసిందిగా జలమండలి అభ్యర్థించింది. సుమారు +592.00 మీటర్ల ఎత్తు స్థాయిలో ఉన్న భూభాగం టోపోగ్రాఫికల్ కంటూర్ ప్రకారం మొత్తం సర్వీస్ ప్రాంతానికి గ్రావిటీ విధానంలో(పంపింగ్ అవసరం లేకుండా) తాగునీటి సరఫరా చేయడానికి అనుకూలంగా ఉంది.కొకాపేట్–నియోపోలిస్ ప్రాంతంలో పెరుగుతున్న తాగునీటి అవసరాలను తీర్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఖానాపూర్ క్యాంపస్ వద్ద పై పేర్కొన్న 3.95 ఎకరాల భూమిని జలమండలికి కేటాయిస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉత్వర్వులు జారీ చేసింది.
ఇక్కడ రిజర్వాయర్ ద్వారా నియో పోలీస్, కోకాపేట పరిసర ప్రాంతాలకే కాకుండా, నగరంలోని బోజగుట్ట రిజర్వాయర్ కు గ్రావిటీతో సరఫరా చేయడమే కాకుండా.. ఓల్డ్ సిటీ,షేక్ పేట, రెడ్ హిల్స్, మెహిదీపట్నం ప్రాంతవాసులకు గ్రావిటీ తో మంచినీటి సరఫరా చేసే వెసులుబాటు ఉంటుంది. దానిద్వారా కరెంట్ చార్జీలు అదా అవుతాయి.