|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 04:00 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. 100 మిలియన్ల (10 కోట్లు) ఫాలోవర్ల మైలురాయిని దాటిన తొలి ప్రపంచ నేతగా ఆయన చరిత్రకెక్కారు. 2014లో ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన మోదీ, దశాబ్ద కాలంలో ఈ అరుదైన ఘనతను సాధించడం విశేషం.ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాధినేతలతో పోలిస్తే ప్రధాని మోదీ ఫాలోవర్ల సంఖ్య అత్యధికంగా ఉంది. రెండో స్థానంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (43.2 మిలియన్లు) కంటే మోదీకి రెట్టింపునకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అంతేకాకుండా, తర్వాతి ఐదుగురు ప్రపంచ నేతల ఫాలోవర్ల సంఖ్యను కలిపినా కూడా మోదీ సంఖ్యను అందుకోలేకపోవడం గమనార్హం. ఈ జాబితాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో (15 మిలియన్లు), బ్రెజిల్ అధ్యక్షుడు లూలా (14.4 మిలియన్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.