|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 07:45 PM
మత్స్య కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 8.91 లక్షల వ్యయంతో మంచినీటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం కలెక్టర్ గరిమ అగ్రవాల్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ శ్రీనివాస్, ఎన్ఎఫ్‌డీబీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్. కన్నప్ప, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ సీఓఓ ఎస్వీ మురుగన్, జిల్లా మత్స్య అధికారి సౌజన్యతో కలిసి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.