|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 07:52 PM
నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రిక్వెస్ట్ బస్ స్టాప్ వద్ద ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. బస్ డ్రైవర్లు స్టాప్ వద్ద ఆగకుండా, ప్రయాణికులను పట్టించుకోకుండా సొంత వాహనంలో ఇష్టానుసారంగా నడుపుతున్నారని వారు పేర్కొన్నారు. తక్షణమే డిపో మేనేజర్ స్పందించి, డ్రైవర్లకు రిక్వెస్ట్ స్టాపులను సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలింగ్ ఇవ్వాలని ప్రయాణికులు కోరారు. స్టాప్ ఉన్నప్పటికీ ఆపని డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.