|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 08:32 PM
అమీన్పూర్, ఫిబ్రవరి 27:పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని అమీన్‌పూర్ గ్రామంలోని మస్జిద్-ఈ-ఆలంగీర్ వద్ద ఇఫ్తార్ విందు అత్యంత వైభవంగా జరిగింది. మహమ్మద్ మోయిన్ ఖాన్ (అలియాస్ బాబా బాయ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 800 మంది ముస్లిం సోదరులు పాల్గొని సామూహిక ప్రార్థనల అనంతరం ఇఫ్తార్ విందును స్వీకరించారు.ఈ కార్యక్రమానికి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారితో పాటు అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ కౌన్సిలర్ కృష్ణ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ:"రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీక. ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ రోజున అందరూ కలిసి మెలిసి విందులో పాల్గొనడం సంతోషంగా ఉంది. గంగా-జమునా తెహజీబ్‌కు అమీన్‌పూర్ నిదర్శనంగా నిలుస్తోంది. ముస్లిం సోదరులకు అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను," అని పేర్కొన్నారు.కార్యక్రమ నిర్వాహకులు బాబా బాయ్ మాట్లాడుతూ, రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టే సోదరుల కోసం ప్రతి ఏటా ఈ సేవను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కౌన్సిలర్ కృష్ణ, మాజీ కోఆప్షన్ నెంబర్ తలారి రాములు, మాజీ కో ఆప్షన్ నెంబర్ యునుస్,అమీన్పూర్ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రమోద రెడ్డి, కొల్లూరు గోపాల్, ఆసిఫ్ ,కొల్లూరి యాదగిరి, గాలి గిరి, మైపాల్ రెడ్డి, దాసు యాదవ్, ఐలాపురం నర్సింగ్ రావు, అమీన్పూర్ గ్రామ పెద్ద బి ఆర్ ఎస్ పార్టీ మైనారిటీ మండల ప్రెసిడెంట్ శోకత్ అలీ, మైనార్టీ పెద్దలు, మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.