|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 10:12 AM
TG: భద్రాద్రి జిల్లా పాల్వంచలోని ఇంటర్ పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్థిని పరీక్ష మధ్యలో అస్వస్థతకు గురైంది. 16 ఏళ్ల ఫస్టియర్ విద్యార్థిని పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే నొప్పులతో బాత్రూంకు వెళ్లింది. అనుమానం వచ్చిన మహిళా ఇన్విజిలేటర్, సిబ్బంది వెళ్లి చూడగా, బాత్రూంలోనే ఆమెకు గర్భస్రావం జరిగినట్లు గుర్తించారు. మృతదేహాన్ని బేసిన్‌లో కుక్కినట్లు సమాచారం. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, ఆమె 5 నెలల గర్భవతి అని తెలిసింది.