|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 03:23 PM
ఢిల్లీ మద్యం విధానం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కవితపై సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ కోర్టు పూర్తిస్థాయిలో 'క్లీన్ చిట్' ఇచ్చింది.సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో పేర్కొన్న అంశాలను నిర్ధారించడానికి సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. కేవలం ఆరోపణలతో ఒక వ్యక్తిని నిందితుడిగా కొనసాగించలేమని, తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ విఫలమైందని తేల్చి చెప్పింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 23 మందిపై కూడా సరైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంటూ వారిపై ఉన్న కేసులను కొట్టివేసింది.