|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 03:21 PM
స్వాతంత్ర్య సమరయోధుడు మహాత్మా గాంధీ గారి స్వదేశీ ఉద్యమంలో భాగంగా దేశీయ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు నూలు రాట్నం చరఖాను వడికిన స్ఫూర్తిని నేటి తరానికి చేరవేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో వికారాబాద్ లో కొనసాగుతున్న ఉభయ తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల సమావేశం ఏడవ రోజుకు చేరుకుంది.శుక్రవారం జరిగిన కార్యక్రమాల్లో భాగంగా సహచర డీసీసీ అధ్యక్షులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు,ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు చరఖాను తిప్పి పత్తి నుండి దారం తయారు చేస్తూ స్వదేశీ భావాన్ని ప్రతిబింబించారు.అదేవిధంగా స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్తను చీపురు పట్టి ఊడ్చి శుభ్రం చేశారు. “మన పనులు మనమే చేసుకోవాలి” అనే సందేశంతో భోజనం అనంతరం తిన్న ప్లేట్లను స్వయంగా కడిగి ఆదర్శంగా నిలిచారు.నేతన్నలపై తనకున్న అభిమానాన్ని ఈ చర్యల ద్వారా బీర్ల అయిలయ్య గారు చాటుకున్నారు.నియోజకవర్గంలోని నేతన్నల సమస్యల పరిష్కారం కోసం అంకితభావంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఆయా ప్రాంతంలో ప్రజలు కూడా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.