|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 10:37 AM
ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన అర్హులైన పేదలకు న్యాయం చేయాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, డీసీసీ మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి వినతిపత్రం అందజేశారు. భూదాన్ భూములను అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరగా, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అర్హులైన పేదల పట్ల ప్రభుత్వపరంగా న్యాయం జరిగేలా చూడాలని వినతిలో పేర్కొన్నారు.