|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 10:36 AM
వ్యాపారాల పేరుతో పలువురి ఖాతాల నుంచి సుమారు రూ. 500 కోట్ల మేర స్వాహా చేసిన కేసులో సత్తుపల్లి పోలీసులు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. గురువారం ఇస్లావత్ లక్ష్మీకల్యాణ్, భూక్యా తరుణ్, బిల్లా సాయితరుణ్, సంగెం ప్రవీణ్ కుమార్, వీరంశెట్టి వంశీ, అబ్దుల్ లను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ టి. శ్రీహరి తెలిపారు. ఇటీవల 14 మందిని అరెస్ట్ చేయగా, వారి విచారణ అనంతరం ఈ ఆరుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు ఆయన వెల్లడించారు.