|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 03:49 PM
తెలంగాణలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని, సమాజం తలదించుకోవాల్సిన ఘటన కుమ్మెర జాతరలో జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కుమ్మెర జాతరలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. ఈనాటికీ కులం పేరు మీద దాడులు దారుణమని అన్నారు.రెండేళ్ల చిన్నారికి కులం తెలుసా, మతం తెలుసా, పసిగుడ్డు ఏం అడిగిందని పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ ఘటనకు కారణమైన 8 మందిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చిన్నారి ప్రాణాలు తీసిన వారికి ఎవరూ అండగా నిలవవద్దని అన్నారు.నిందితులను కాపాడేయత్నం సిగ్గుమాలిన చర్య అన్నారు. వారు ఏ పార్టీకి చెందిన వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.1 కోటి పరిహారం చెల్లించాలని కేటీఆర్ అన్నారు.