|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 03:48 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్ పి. పి. నగర్ లో నూతనంగా నిర్మించిన సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభన కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆపదలను తొలగించి అభయమిచ్చే ఆంజనేయస్వామి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షించారు. దేవాలయ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసిన ఆలయ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.