మార్చి 13న పటాన్చెరులో.. ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందు
Sat, Feb 28, 2026, 10:41 AM
|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:21 PM
అమీన్పూర్ : అమీన్పూర్ డివిజన్ పరిధిలోని మస్జిద్ ఏ అమీనా అలంగీర్ మసీదులో సీనియర్ నాయకులు ఆసిఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఇఫ్తార్ విందులు ప్రతీకలని అన్నారు. హాజరైన మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, సీనియర్ నాయకులు కృష్ణ, గోపాల్, చంద్రశేఖర్, తలారి రాములు, మైనార్టీ మత పెద్దలు పాల్గొన్నారు.