|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 03:46 PM
రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఆర్కే నగర్ కాలనీలో కౌన్సిలర్ శివ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రంజాన్ క్యాలెండర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ… రంజాన్ మాసం త్యాగం, సహనం, ఆత్మ నియంత్రణతో పాటు దైవభక్తిని ప్రజల్లో మరింత లోతుగా నాటే పవిత్ర కాలమని తెలిపారు. ముస్లిం సోదరులు నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, సమిష్టిగా చేసే ప్రార్థనలు సమాజంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని బలపరుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సోదరులు, ఇతరులు పాల్గొన్నారు.