గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారికి నాగబాబు ఆర్థిక సాయం
Mon, Feb 23, 2026, 11:22 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 04:13 PM
విద్యావ్యవస్థలో మాతృభాష తెలుగుకు పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ తరాలకు తెలుగు భాషా సౌరభాన్ని అందించడమే లక్ష్యంగా, వచ్చే 2026-27 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగును కచ్చితంగా ఒక సబ్జెక్టుగా బోధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం స్టేట్ బోర్డు పాఠశాలలకే పరిమితం కాకుండా, సీబీఎస్ఈ (CBSE), ఐసీఎస్ఈ (ICSE), ఐబీ (IB) వంటి అంతర్జాతీయ ప్రమాణాలతో నడిచే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లోనూ మాతృభాషను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.