|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 04:12 PM
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత సెషన్‌లో భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే, అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, డాలర్ బలహీనపడటం వంటి అంశాలు పసిడి పతనాన్ని కొంతవరకు అడ్డుకున్నాయి.మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈరోజు ట్రేడింగ్ సందర్భంగా ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.25% తగ్గి 10 గ్రాములకు రూ.1,60,741 వద్దకు చేరింది. అలాగే మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ 1.16% నష్టపోయి కిలోకు రూ.2,65,200 వద్ద ట్రేడ్ అయింది. నిన్నటి సెషన్‌లో బంగారం 0.74%, వెండి 3% మేర లాభపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మదుపరులు లాభాలను స్వీకరించేందుకు ఆసక్తి చూపారు.