గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారికి నాగబాబు ఆర్థిక సాయం
Mon, Feb 23, 2026, 11:22 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 04:11 PM
ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ ఆపరేషన్ లో వందలాది మంది మావోలు మృతి చెందారు. వీరిలో అత్యంత కీలకమైన మావో లీడర్లు కూడా ఉన్నారు. ఇప్పటికే అనేక మంది మావోలు లొంగిపోయారు. పలువురు మావోలు లొంగిపోవడానికి సిద్దంగా ఉన్నారు. మరోవైపు, మావోలపై భద్రతాబలగాలు విరుచుకుపడుతూనే ఉన్నాయి. తాజాగా, ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లా ఇంద్రావతి ప్రాంతంలో మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. ఘటనా స్థలి నుంచి మృతదేహాలతో పాటు, భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.