మార్చి 13న పటాన్చెరులో.. ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందు
Sat, Feb 28, 2026, 10:41 AM
|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:32 PM
ఫార్ములా ఈ రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను బదిలీ చేస్తూ, ఎక్కడా కొత్త పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచింది. రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ గురువారం రాత్రి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ క్రమంలో ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంబంధిత దస్త్రంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేశారని, నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.