|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 03:29 PM
పటాన్చెరు : బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు.. పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి కుమారుడు.. శ్రీ గూడెం విక్రమ్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం పటాన్చెరు నియోజకవర్గంలో అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి.అమీన్పూర్ డివిజన్ పరిధిలోని మహిమ మినిస్ట్రీస్ అనాధ ఆశ్రమంలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి.. ప్రత్యేక భోజనాలు అందించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జివిఆర్ యువసేన ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తండ్రికి తగ్గ తనయుడుగా పటాన్చెరు నియోజకవర్గంలో యువతకు స్ఫూర్తి ప్రదాతగా గూడెం విక్రం రెడ్డి నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, గూడెం సంతోష్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అశోక్, వెంకటేష్, సోహియల్, నాగరాజు, సాయిరాం గుప్తా, గుండమొల్ల రాజు, కిష్టయ్య, షకీల్, గిరి, జివిఆర్ యువసేన సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.