|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:36 PM
వికారాబాద్ లో ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పట్టణంలోని గంగారాం సాయి బాబా కాలనీలో నివాసం ఉంటున్న బలిజ దివ్య (27) ఇవాళ తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.వివరాల్లోకి వెళితే... బలిజ దివ్య కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ధరూర్ సీఐ కార్యాలయానికి అటాచ్‌గా పనిచేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఆమె ఉరివేసుకుని ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వికారాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.