|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 12:25 PM
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక ఆటో డ్రైవర్ సాయికుమార్ (35) ఆత్మహత్య చేసుకున్నారు. భార్య పేరు మీద లోన్ తీసుకున్న ఆయన, సకాలంలో చెల్లించకపోవడంతో ఏజెంట్లు వేధించారు. భార్య ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడంతో మనస్తాపానికి గురై ఉరివేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నా లోన్ యాప్ల ఆగడాలు ఆగడం లేదు.