|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 12:29 PM
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి పట్టణంలో నిన్న లారీ మెడికల్ షాపులోకి దూసుకెళ్లిన ప్రమాద స్థలాన్ని నల్గొండ ఎస్పీ శరత్చంద్ర పవర్ పరిశీలించారు. గతంలో జరిగిన వరుస ప్రమాదాలకు కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుపై వాహనాల పార్కింగ్, షాపుల సైనింగ్ బోర్డులను తొలగించాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణంలో లోపం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి, ఆర్ అండ్ బి అధికారులకు నిర్మాణ లోపాన్ని సవరించాలని సూచించారు. ప్రస్తుతానికి భారీక్రేడ్స్ ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని నియంత్రించాలని సూచనలు ఇచ్చారు.