|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 04:23 PM
ఈరోజు 129 - సూరారం డివిజన్ శ్రీ లక్ష్మీ నగర్ లో కాలనీలో రాహుల్ రెడ్డి, సుభాష్ రెడ్డి, రవీష్ గార్ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన లార్వెన్ బాడ్మింటన్ అకాడమీ ని బిఆర్ ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... శారీకర దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని, ప్రతీ ఒక్కరూ ఏదో ఒక క్రీడ పట్ల ఆసక్తిని కనబరిచినట్లయితే శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటారన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, నాయకులు యాదిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దొడ్ల శ్రీను, శ్రీనివాస్, అమృతా, బషీరుద్దీన్, అజయ్, సిద్దు, మన్నె గుణేష్, గుమ్మడి ప్రసాద్ రెడ్డి, భార్గవ్ రెడ్డి, సిద్ధార్థ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, అఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.