|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:24 PM
మెదక్ మున్సిపల్ ఎన్నికలు ముగిసినప్పటికీ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనపై నమోదైన కేసుల్లో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ను శనివారం తెల్లవారుజామున పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ నేతలు రూరల్ పోలీస్ స్టేషన్కు తరలివెళ్లారు. అయితే ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు, ఏ సెక్షన్లు నమోదు చేశారనే వివరాలను పోలీసులు వెల్లడించడం లేదని, పోలీస్ స్టేషన్లోనికి ఎవరిని అనుమతించడం లేదని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 15 వ వార్డులో జరిగిన దాడి నేపథ్యంలోనే అరెస్టు చేసి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో మల్లికార్జున్ గౌడ్ను విచారిస్తున్నట్లు తెలుస్తుంది.