|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 07:07 PM
పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి, ఎమ్మెల్యే విజయరమణరావు ప్రజా సేవకు ఆకర్షితులై జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎలిగేడు మండలం శివపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో వారికి విజయరమణరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.