|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:44 PM
చేవెళ్ల నియోజకవర్గం: ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య . శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో సాయి బాబా థియేటర్ వెనుక మరియు బీ.వి.ఆర్ గార్డెన్ వద్ద నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఈరోజు ఘనంగా ప్రారంభించిన *చేవెళ్ల శాసనసభ్యులు శ్రీ కాలే యాదయ్య గారు.ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు, ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతి అర్హుడికి ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.