|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 11:36 AM
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. రౌస్ అవెన్యూ కోర్టు కవితకు క్లీన్‌చిట్ ఇచ్చింది. విచారణ సందర్భంగా కోర్టు సీబీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛార్జ్‌షీట్‌లో అనేక లోపాలున్నాయంటూ కేసును కొట్టివేసింది. సరైన ఆధారాలు లేకుండానే వారిని కేసులో ఇరికించారని మండిపడింది. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కవిత సహా 23 మందికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. మరోవైపు లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ కేసు నడుస్తోంది.