|
|
by Suryaa Desk | Fri, Mar 06, 2026, 02:59 PM
జోగులాంబ గద్వాల పట్టణంలోని 23వ వార్డు తెలుగు పేటలో శ్రీ లక్ష్మమ్మ దేవాలయ ప్రారంభోత్సవం మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం భక్తిశ్రద్ధలతో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పూజారుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి లక్ష్మమ్మ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. మహిళలు బోనాలు, హారతులు సమర్పిస్తూ పాల్గొన్నారు. వార్డు ప్రజలు తమ ప్రాంతంలో గుడి నిర్మాణం కావడం ఆనందంగా ఉందని, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మంచి అవకాశం కలుగుతుందని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు నాయకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.