|
|
by Suryaa Desk | Fri, Mar 06, 2026, 04:00 PM
శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఐదు బృందాలు టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, బయోడైవర్సిటీ విభాగాలలో తనిఖీలు చేస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను నియంత్రించడంలో వైఫల్యం, అవినీతి ఆరోపణలపై ఈ ఆకస్మిక తనిఖీలు జరిగాయి. అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసి, వివరణ పేరుతో బేరసారాలు ఆడుతూ, వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులున్నాయి. పది నెలల్లో 450 నోటీసులు జారీ చేసినా చర్యలు తీసుకోకపోవడంపై అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.