|
|
by Suryaa Desk | Sun, Jan 18, 2026, 11:13 PM
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ మోడ్‌లో ఉంది.చిరంజీవి కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ హిట్ దిశగా సాగుతోంది. అన్ని థియేటర్లలో హౌజ్ ఫుల్ షోలు కొనసాగుతున్నాయి. విడుదలైన 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి, రూ. 300 కోట్లు దిశగా పరుగులు తీస్తోంది. బుక్‌మైషోలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటివరకు 2.5 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడయి, అత్యంత వేగంగా ఈ ఘనతను సాధించిన ప్రథమ రీజనల్ మూవీగా చిరంజీవి సినిమా నిలిచింది.మెగాస్టార్ చిరంజీవి మరియు అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. 6 రోజుల్లోనే రూ. 300 కోట్లు వసూలు చేసి, చిరంజీవి కెరీర్‌లో ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్గా నిలిచింది. 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి తగ్గని ఎన్‌ర్జీతో నటిస్తున్నారని నెటిజన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.ఇకంతలో మెగాస్టార్ మరో రికార్డును సృష్టించారు. తన కుమారుడు రామ్ చరణ్, సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సృష్టించిన కెరీర్ బెస్ట్ రికార్డులను ‘మన శంకర వరప్రసాద్ గారు’ 6 రోజుల్లోనే బ్రేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజే రూ. 20.75 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది.ఇంతకీ అదీ కాదు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ‘ఓజీ’ 27.8 లక్షలు టికెట్లు సొల్డ్ చేసిందని రికార్డు ఉంది. కానీ చిరంజీవి సినిమా అదే రికార్డు కేవలం 6 రోజుల్లోనే అధిగమించింది. బుక్‌మైషోలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం 28.1 లక్షలు టికెట్లు అమ్ముడయి, రామ్ చరణ్ మరియు పవన్ కల్యాణ్ రికార్డులను బ్రేక్ చేసింది.
Latest News