|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 11:13 AM
జలమండలి బోర్డు పరిధి కోర్ అర్బన్ రీజయన్ వరకు పరిధి పెరగడంతో వాటర్.. సీవరేజ్ సేవలు మరింత సమర్ధవంతంగా అందించే విధంగా స్థానికంగా నెలకొన్న సమస్యలు గుర్తించి వాటిని అధిగమించడంతో పాటు ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునే విధంగా ‘జలమండలి.. బస్తీ బాట’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు రూపొందించిన ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ నుంచి వార్డు మేనేజర్ల వరకు భాగస్వామ్యులుగా ఉంటారు. వారంలో నాలుగు రోజులు:జల మండలి పరిధిలోని బస్తీ, కాలనీలలో ప్రతి మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు మేనేజింగ్ డైరెక్టర్ నుంచి వార్డు మేనేజర్ల వరకు పర్యటిస్తారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కార్యాలయంలో యధావిధిగా అందుబాటులో ఉంటారు. క్షేత్ర స్థాయిలో ఎండీ నుంచి వార్డు మేనేజర్ల వరకు పర్యటించి, మంచినీరు, సీవరేజీ సమస్యలు గుర్తించి, ప్రజలతో మాట్లాడి, సమస్యలు తెలుసుకొని, తాత్కాలిక సమస్యలు తక్షణమే పరిష్కారించి, శాశ్వత పరిష్కారం కోసం వార్డుల వారిగా ప్రణాళికలు రూపొందించుకుంటారు.
బస్తీలో పర్యటన తీరును పరిశీలించేందుకు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్, జాయింట్ ఎండీ, డైరెక్టర్లు, రీజియన్ ఈడీలు, డైరెక్టర్ (ఆపరేషన్)లు, జోన్ సీజీఎం, జనరల్ మేనేర్లు, సర్కిల్ డీజీఎం వరకు వారి పరిధిలో అకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. సమస్యల పరిష్కరానికి ప్రజలతో మమేకం అవుతారు.
క్షేత్రస్థాయి పర్యటనలో ప్రాధాన్యత ఇలా..
సీవరేజీ మ్యాన్ హోల్స్, పైప్‌లైన్ పరిస్థితి, లీకేజీ, ఓవర్ ఫ్లో, డీసిల్టింగ్ పరిశీలన.. సత్వర చర్యలు చేపడతారు.
వాటర్ పైప్‌లైన్, లీకేజీలు, నీటి సరఫరాలో సమయ పాలన, నీటి వృధా, లో-ప్రెషర్, నల్లలకు మోటర్ల బిగింపు, సరఫరా అవుతున్న తాగు నీటి నాణ్యత పరిశీలించి.. సత్వర చర్యలు తీసుకుంటారు.
అలాగే నివాసాల్లో భూగర్బజలాల పెంపు కోసం ఇంకుడు గుంతలు, ఇంజక్షన్ బోర్‌వెల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
డైలీ రిపోర్టు:ప్రతి వార్డు మేనేజర్ పర్యటన రోజుకు సంబంధించి గుర్తించిన సమస్యలు, తాత్కాలిక పరిష్కారాలు, శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళిక ప్రతిపాధనలు రూపొందించి ఆన్‌లైన్ యాప్‌లో సర్కిల్ డీజీఎంలకు, సర్కిల్ డీజీఎంలు సర్కిల్ వారిగా జోన్‌లకు, జోన్ నుండి జోన్‌ల వారిగా రీజియన్‌కు, రీజియన్ నుంచి కేంద్ర కార్యాలయాన ఆన్‌లైన్ నివేదికలు సమర్పిస్తారు. ప్రతి వారం పర్యటనపై శనివారం సమీక్షా సమేవేశం నిర్వహిస్తారు.
రేపటినుంచే.. జలమండలి బస్తీ బాట:
రేపటి (శుక్రవారం) నుంచి ‘జలమండలి.. బస్తీ బాట’ కార్యక్రమం ప్రారంభింస్తారు. ప్రజల్లో జలమండలిపై మరింత నమ్మకం కలిగించే విధంగా క్రార్యక్రమాన్ని రూపొందించారు.