|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 11:17 AM
రాంగోపాల్‌పేట్ డివిజన్ పరిధిలోని జనరల్ బజార్ మరియు అంబేద్కర్ నగర్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.తెలంగాణ గోల్డ్ అండ్ సిల్వర్ రిఫైనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీమతి అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ మరియు డివిజన్ నాయకులతో కలిసి వేడికల్లో పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ విగ్రహానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు శ్రీమతి అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రత్యేక పూజలు నిర్వహించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు ఎమ్మెల్యే గారిని మరియు శ్రీమతి అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ గారిని శివాజీ ప్రతిమతో బహుకరించి, ఘనంగా సన్మానించారు.
నిర్వాహకులు: ఆనంద్ పాటిల్, ప్రకాష్ పాటిల్, చంద్రప్రకాష్,సురేష్ భోస్లే, పబ్బా ప్రకాష్,విశాల్ మరియు అసోసియేషన్ సభ్యులు, డివిజన్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం అంబేద్కర్ నగర్ ప్రాంగణంలో యువత ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో శ్రీమతి అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ గారు మరియు డివిజన్ నాయకులతో కలిసి పాల్గొని, శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. *నిర్వాహకులు:* దేవరాజ్, గణేష్, ప్రభాకర్,లాలి, దత్తసాగర్, శివకుమార్, సోను,శ్రీకాంత్, విజయ్, వెంకట్, గణేష్, చింటూ, నాని, కిరణ్, పండు, సత్యరాజు, కిరణ్ తదితరులు. *డివిజన్ నాయకులు:* ఆంజనేయులు, రామ్మోహన్, మనోహర్ యాదవ్ , కోటి,టీనా,గౌరీ శంకర్,చందు,శివకుమార్, గజ్జు భాయ్,అరుణ్ బట్, సంజయ్, వెంకటేష్, కిరణ్, అబ్బులు, శ్రీకాంత్,సతీష్, నర్సింగ్, అభిషేక్, ప్రవీణ్, మిట్టు తదితరులు.