అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 11:39 AM
టీవీ సౌండ్ తగ్గించమని అడిగిన భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని మంగళగిరి టిడ్కో ఇళ్ల సముదాయంలో గురువారం రాత్రి జరిగింది. టీవీ సౌండ్ తగ్గించమని భర్త అహ్మద్.. భార్య క్రాంతిని కోరాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారస్థాయికి చేరడంతో అహ్మద్‌ను క్రాంతి కత్తితో పొడిచి చంపేసింది. అహ్మద్, క్రాంతి ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకోవడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.