|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 12:44 PM
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని టీజేఎస్ చీఫ్ కోదండరాం తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీవో భవన్‌లో టీఎన్జీవో హైదరాబాద్ సిటీ 2026 డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమని, ఏప్రిల్ నుంచి ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వ స్కీమ్ అమలు, క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేరడంలో ఉద్యోగులే కీలకం అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం అసెంబ్లీలో టీజీవో హైదరాబాద్ సిటీ 2026 క్యాలెండర్, డైరీని స్పీకర్ రిలీజ్ చేశారు. కార్యక్రమంలో టీజీవో కేంద్ర సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరావు, శ్యామ్, హైదరాబాద్ సిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గండూరి వెంకట్ పాల్గొన్నారు.