|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 12:16 PM
పటాన్చెరు : ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరంబండ చౌరస్తాలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకొని తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన.. చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని గురువారం సాయంత్రం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భావితరాలకు మహనీయుల చరిత్రను తెలియజేయాలన్న సమన్నత లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శివాజీ తన పరిపాలనలో లౌకికవాదానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. శివాజీ అనుసరించిన పరిపాలన విధానాలు, వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శప్రాయం అని అన్నారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు బండి శంకర్, శివారెడ్డిలను ఘనంగా సన్మానించారు. హాజరైన మున్సిపల్ చైర్మన్ కుశంగుల ప్రమీల, వైస్ చైర్మన్ పట్లోళ్ల హరీష్ రెడ్డి, సీనియర్ నాయకులు అంతిరెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్లు, శివాజీ ఉత్సవ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.