by Suryaa Desk | Thu, Nov 07, 2024, 04:45 PM
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అంకిత భావంతో ఉందని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి గారితో కలిసి స్థానిక అయ్యప్ప కాటన్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని చైర్ పర్సన్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పత్తి పంటలో 8 శాతం తేమ ఉంటే ప్రభుత్వం రూ.7521 మద్దతు ధర ప్రకటించిందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చందర్ నాయక్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, నాయకులు ఎర్రవల్లి జాఫర్, సర్పరాజ్, ఎన్నెపల్లి కృష్ణ, మార్కెట్ కమిటీ సెక్రెటరీ ముక్రమ్, మార్కెట్ సూపర్వైజర్ సాయి, మార్కెట్ కమిటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.