by Suryaa Desk | Fri, Nov 08, 2024, 02:18 PM
హమాలి కార్మికులకు సంక్షేమ చట్టం తీసుకురావాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు చిరంజీవి అన్నారు. గురువారం హమాలీ కార్మికులతో నారాయణఖేడ్ పట్టణంలోని బైపాస్ రోడ్ లో నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు చిరంజీవి మాట్లాడుతూ....సంక్షేమ చట్టం కార్మికులకు తీసుకురావాలన్నారు ప్రభుత్వం అమాలి కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహించడం తగ్గదు అన్నారు.
సంక్షేమ చట్టంతో పాటు వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. వారి వయసు రిత్యా వారికి పెన్షన్స్ సౌకర్యం కల్పించాలన్నారు హమాలి కార్మికులు పనిచేస్తున్న క్రమంలో ప్రమాదాలు జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించి వారికి ప్రత్యేక నిధిని కేటాయించాలన్నారు. బజార్ హమాలి గాని సిమెంట్ షాపుల్లో పనిచేస్తున్న వరి కోయిల కేంద్రంలో పనిచేస్తున్న హమాలీలకు ప్రభుత్వం రోజువారిగా పనులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ వెంకట్ సాయిలు లక్ష్మయ్య పోచయ్య సంగమేశ్ తదితరులు పాల్గొన్నారు.