by Suryaa Desk | Fri, Nov 08, 2024, 02:16 PM
మహాబూబాబాద్ జిల్లా, మండల కేంద్రంలో వానాకాలం సీజన్ కి గాను, వరి ధాన్యము కొనుగోలు విషయంలో, గూడూరు మండల వ్యాప్తంగా కొనుగోలు చేసే అన్ని పిపిసి సెంటర్ ల ఇన్చార్జిలకు, ట్యాబ్ ఎంట్రీ ఆపరేటర్లకు గూడూరు రైతు వేదికలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, వారికి కొనుగోలు చేసే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రైతులకు తగిన సదుపాయాలు చేయడం వంటి సూచనలు సూచించారు.
ఇట్టి కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మహబూబాబాద్ అజ్మీర శ్రీనివాస్ రావు, కొనుగోలు కేంద్రాల తీరును ఉద్దేశించి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేసే సమయంలో ముందస్తుగా టార్పాలిన్ల ను అందుబాటులో ఉంచుకోవాలని, సెంటర్ లలో కనీస వసతులు ఏర్పాటు చేసుకోవాలని దిశ నిర్దేశం చేశారు. అలాగే రైతులకు 17% తేమశాతం మించకుండా, వరి కొనుగోలు కేంద్రానికి నాణ్యత ప్రమాణాలు పాటించి, ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్, ఇన్చార్జి తహసిల్దార్ గోలి కోమల, ఐకెపి ఎపిఎం రామగిరి రవీందర్, ఏఈవోలు, సొసైటీ కార్యదర్శి, గిరిజన కోఆపరేటివ్ సెంటర్ లలో కొనుగోలు నిర్వహణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.