by Suryaa Desk | Fri, Nov 08, 2024, 04:45 PM
దేవరకొండ నియోజకవర్గంలో స్థానిక అయ్యప్ప గుడి ఎదురుగా బుధవారం ఉదయం 6 గంటలకు యాక్సిడెంట్ జరిగిన సంఘటన స్థలంలోఆవంచ శేఖరా చారి తీవ్రంగా గాయాలపాలై రక్తస్రావం జరగింది స్థానిక ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు శేఖర్ చారి మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు బంధువులు కన్నీటి పర్యంతమై దిక్కుతోచని స్థితిలో కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయామని మమ్ములను ఆదుకునేది.
ఎవరని దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడడంతో న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు బంధువులు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ ముందు రోడ్డుపైన బెటాయించి ధర్నా నిర్వహించారు స్థానిక పోలీసులు నచ్చ చెప్పడంతో ధర్నా విరమించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ సేవలాల్ బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షులు చందు నాయక్ పాల్గొని శేఖర చారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.