by Suryaa Desk | Fri, Nov 08, 2024, 02:13 PM
వరంగల్ జిల్లా
నల్లబెల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు డాక్టర్ బానోత్ సారంగపాణి ఆధ్వర్యంలో నల్లబెల్లి మండల పార్టీ కార్యాలయం లో బుచ్చిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన బిజెపి కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది.
ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని నిలదీసి హామీల నెరవేర్చుటకు కీలక పాత్ర పోషిస్తున్న బిఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రజల తరఫున పోరాటానికి సరియైన పార్టీగా భావించి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పని చేయుటకు నిర్ణయించుకొని ఈరోజు బిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది మండల పార్టీ అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారి పేర్లు
బిజెపి గ్రామ పార్టీ నాయకులు గూగులోతు యాకూబ్ నాయక్, భూక్యా రమేష్ నాయక్ . ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు డాక్టర్ బానోత్ సారంగపాణి తో పాటుగా గ్రామ పార్టీ అధ్యక్షుడు భూక్యా సంగూలాల్ , మాజి సర్పంచ్ లూనవత్ వెంకన్న , ఊరటి అమరెందర్ ,బిఆర్ఎస్ మండల నాయకులు,తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల సాంబ రావు , లూన వత్ దేవ్ సింగ్ , బాణోత్ రమేష్ , బాదవత్ రమేష్ , ముట్నేని చంద్ర శేఖర్ పాల్గొనడం జరిగింది.