by Suryaa Desk | Fri, Nov 08, 2024, 11:28 AM
అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు వద్ద ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఛత్ పూజ పండుగ సందర్భంగా బీహార్, ఒడిస్సా ప్రాంత వాసుల ఆధ్వర్యంలో జరిగిన ఛత్ పూజా కార్యక్రమంలో అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జి. శశిధర్ రెడ్డి గారు, బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం ఛైర్మన్ శ్రీ బి. సుధాకర్ యాదవ్ గారు, అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రమేష్ యాదవ్ గారు పాల్గొన్నారు. అమీనుపూర్ మున్సిపల్ పరిధిలో ఉత్తరాది ప్రజల పవిత్ర పండుగలకు పెద్దపీట వేస్తున్నట్లు అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జి. శశిధర్ రెడ్డి గారు అన్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన అమీనుపూర్ పెద్ద చెరువు వద్ద సాయిబాబా దేవాలయంలో ఒడిస్సా మరియు బీహార్ రాష్ట్రా వాసులతో కలిసి ఛత్ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య భగవానుడికి మహిళలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శశిధర్ రెడ్డి గారు మాట్లాడుతూ... మినీ ఇండియా'గా పేరొందిన పటాన్ చెరు పారిశ్రామిక వాడలోని అమీనుపూర్ ప్రాంతంలో ఉత్తరాది ప్రజల భక్తి విశ్వాసాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. వారి పండుగలో సైతం పాల్గొంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడి వారైనా ఇక్కడ అంతా కుటుంబ సభ్యులలాగే కలిసిమెలిసి జీవనాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా స్థానికంగా నివసించే ఒడిస్సా, బీహార్ ప్రాంత సభ్యులు శశిధర్ రెడ్డి గారిని, సుధాకర్ యాదవ్ గారిని మరియు స్థానిక నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చుక్కా రెడ్డి, కృష్ణయాదవ్, రమేష్ యాదవ్, నరేంద్ర కాలని ఉమామహేశ్వర్, ఇసుకబాయి సాయి, తదితరులు పాల్గొన్నారు. ఛత్ పూజా కార్యక్రమంలో ఒడిస్సా, బీహార్ ప్రాంత వాసులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.