by Suryaa Desk | Fri, Nov 08, 2024, 03:30 PM
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం రోజున పిఏ పల్లి మండల కేంద్రంలో జరిగిన సిపిఎం మండల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ అతివృష్టి వచ్చిన అనావృష్టి వచ్చిన నష్టపోయేది రైతన్న అని అన్నారు.
వర్షాలకు వేలాది ఎకరాల పంట నష్టపోయిన రైతన్నను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు.దాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయని కారణంగా, మిల్లర్ల దోపిడీ పెరిగిందని ఈ సందర్భంగా తెలిపారు.ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం నల్గొండ జిల్లా ప్రాజెక్టులకు పూర్తికి అఖిలపక్ష సమావేశం పిలిచి తగిన నిధులు విడుదల చేయాలని మంత్రులను కోరారు. డిండి ఎత్తిపోతల పథకంలో పెండింగ్లో ఉన్న భూసేకరణకునిధులుకేటాయించాలని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపచేయాలని, పూర్తి నిర్వాసితులకు బహిరంగ మార్కెట్ లో ఉన్న ధరను భూమికి ఇవ్వాలని కోరారు. శ్రీశైలం సొరంగ మార్గం పనులు సత్వర పూర్తికి సుమారు రూ. 2200 కోట్లు కేటాయించాలి నల్లగొండ జిల్లాలో సుమారు 3.20 వేల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు సాగునీరు ఇచ్చే శ్రీశైలం సొరంగం పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. 19 సం॥రాల క్రితం 1925 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన పనులు నేటికి 4658 కోట్ల అంచనా వ్యయానికి చేరింది. 9.5 కి.మీ. సొరంగం తవ్వాల్సి ఉన్నది.
గత ప్రభుత్వం 10ఎండ్లలో అరకొర నిధులు కేటాయించడం వలన సొరంగం పనుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వల్ల ఎంతమాత్రం ముందుకు సాగ లేదు. సొరంగం పూర్తయితే సాగు, తాగు నీరు అందుతుంది. సుమారు 2.20 టిఎంసిల నీటి సామార్డ్యం కలిగిన పెండ్లిపాకల ప్రాజెక్టు పనులు కూడా పూర్తిగా నిలిచిపోయినవి. దానికి కింద 950 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించి పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నదని. సొరంగం మరియు పెండ్లిపాకల ప్రాజెక్టు పూర్తి చేయుటకు అవసరమైన నిధులను, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈసమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనందు మండల కార్యదర్శి పెరిక విజయ్ కుమార్ నాయకులు కావలి కృష్ణయ్య దేవయ్య మండలి రాజశేఖర్ సత్యనారాయణ చారి రామకృష్ణ చందు నాయక్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.